నెల రోజుల నుంచి రాని తాగునీరు - ఖాళీ బిందెలతో మహిళల నిరసన - నీరు కోసం మహిళల నిరసన
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 7, 2023, 6:09 PM IST
Women Protests Scarcity of Water : నెల రోజుల నుంచి తాగునీటి కోసం ఆ గ్రామ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా స్పందనే లేదు. దీంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఆందోళనకు దిగారు. ఖాళీ బిందెలతో మహిళలు ఎంపీడీవో కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. అనంతపురం జిల్లా కుందుర్పి మండలం నాగేపల్లి గ్రామానికి చెందిన మహిళలు తాగు నీరు సమస్య గురించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమకు వెంటనే నీటి సరఫరా చేయాలని అధికారులను మంగళవారం డిమాండ్ చేశారు.
Water Crisis in Anatapur District : నెల రోజుల నుంచి తమ గ్రామానికి తాగు నీరు రావడం లేదన్నారు. మంచినీటి పథకం నుంచి కూడా నీరు రాకపోవడంతో (womens get anger)మహిళలు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. తాగు నీరు సమస్యల పై అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోక పోవటంతో సహనం కోల్పోయిన మహిళలు ఎంపీడీవో కార్యాలయం ముందు బిందెలతో బైఠాయించారు. నీటి సమస్యతో గ్రామంలో ఎలా బతకాలని ఈ సందర్భంగా మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.