తగ్గేదేలే - సెల్ఫీల కోసం జుట్లు పట్టుకుని కొట్టుకున్న మహిళలు - సెల్ఫీల కోసం మహిళలు కొట్టుకున్న వైరల్ వీడియో
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 27, 2023, 3:44 PM IST
|Updated : Nov 27, 2023, 4:32 PM IST
Women Fighting for Selfies in Guntur: సెల్ఫీ.. ఈ మధ్య ఎక్కడికి వెళ్లినా.. చిన్నా పెద్దా అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ వీటి కోసం పోటీపడుతున్నారు. కొంతమంది అయితే.. కనీసం రోజుకు ఒక్క సెల్ఫీ అయినా తీసుకుంటారు. వాటిని సామాజిక మాధ్యమాలలో షేర్ చేస్తుంటారు. తాజాగా సెల్ఫీ ఓ వివాదానికి కారణం అయింది. మహిళల మధ్య చిచ్చుపెట్టింది.
సెల్ఫీల కోసం మహిళలు తగ్గేదేలే అంటూ ఘోరంగా కొట్టుకున్న వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. గుంటూరు నగర నడిబొడ్డున ఉన్న గాంధీ పార్కులో వందలాది ప్రజల మధ్య యువతులు పరస్పరం దారుణంగా దాడి చేసుకున్నారు. ఆధునీకరించిన గాంధీ పార్కును ఇటీవలే తిరిగి ప్రారంభించడంతో.. నగరవాసులు పెద్ద సంఖ్యలో పార్క్‌కు తరలివచ్చారు. ఇక ఆదివారం కావడంతో చిన్నారులు, మహిళలు భారీగా పార్కుకు వచ్చారు. పార్కులో ఏర్పాటు చేసిన బటర్ ప్లై జోన్ వద్ద యువతుల మధ్య గొడవ జరగ్గా.. జుట్లు పట్టుకుని పరస్పరం దాడి చేసుకున్నారు. మరోవైపు పార్క్ దగ్గర సరైన సెక్యూరిటీ లేకపోవడం వల్లే గొడవ జరిగిందని పలువురు అంటున్నారు.
ఇప్పుడు ఈ వీడియో కాస్తా సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. ఒక్కొక్కరూ వెరైటీ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ ఈ వీడియో చూసిన తరువాత మరి మీ కామెంట్ ఏంటి.