Vizianagaram Pydithalli Ammavari Sirimanotsavam: ఘనంగా విజయనగరం పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం.. పోటెత్తిన భక్తులు - ఏపీ లేటెస్ట్ న్యూస్

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 31, 2023, 9:18 PM IST

Vizianagaram Pydithalli Ammavari Sirimanotsavam: ఉత్తరాంధ్ర కల్పవల్లి, విజయనగరం ప్రజల ఆరాధ్యదైవం పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం ఘనంగా జరిగింది. సంప్రదాయబద్దంగా పాలధార, తెల్ల ఏనుగు, అంజలిరథం ముందు నడవగా.. భక్తుల జయజయ ధ్వానాల మధ్య పైడితల్లి అమ్మవారు ఉత్సవ వీధుల్లో సిరిమాను రూపంలో ముమ్మారు ఊరేగి ప్రజలను ఆశీర్వదించారు. అమ్మవారి ప్రతిరూపంగా సిరిమానుపై పైడితల్లి ఆలయ ప్రధాన పూజారి ఆశీనులై భక్తులకు దర్శనమిచ్చారు. సిరిమాను రూపంలో పైడితల్లి అమ్మవారు.. తన పుట్టినిల్లు విజయనగరం కోట వరకు 3 సార్లు ఊరేగి.. రాజకుటుంబానికి దీవెనలు అందించారు. 

Pydithalli Ammavaru Vizianagaram: పైడితల్లి సిరిమానోత్సవాన్ని తిలకించేందుకు కుటుంబసభ్యులతో కలిసి విజయనగరం కోటపై ఆశీనులైన పైడితల్లి ఆలయ అనువంశిక ధర్మకర్త, పూసపాటి వంశీయులు అశోక గజపతిరాజు విచ్చేశారు. డీసీసీబీ భవనం నుంచి మంత్రులు.. బొత్స సత్యనారాయణ, అమర్​నాథ్ రెడ్డి, జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, కలెక్టర్ నాగలక్ష్మి తదితరులు వీక్షించారు. ఈ ఉత్సవాలకు ఉత్తరాంధ్ర నుంచే కాకుండా రాష్ట్ర ఇతర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉత్తరాంధ్రుల ఇలవేల్పు, ఆరాధ్యదైవం శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం సందర్భంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ శుభాకాంక్షలు(Nara lokesh Tweet on Sirimanotsavam) తెలియజేశారు. అమ్మవారి ఆశీస్సులతో అందరికీ ఆయురారోగ్యాలు కలగాలని కోరుకుంటున్నట్లు పేర్కొంటూ ట్వీట్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.