Protest against MLA Jogarao: ఎమ్మెల్యే జోగారావుకు నిరసన సెగ.. వాహనాన్ని అడ్డుకున్న గ్రామస్థులు
🎬 Watch Now: Feature Video
Villagers Protest Against MLA Jogarao: పార్వతీపురం వైఎస్సార్ కాంగ్రెెస్ పార్టీ ఎమ్మెల్యే జోగారావుకు నిరసన సెగ తగిలింది. తాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మన్యం జిల్లా DK పట్నంలో MLA వాహనాన్ని కొందరు స్థానికులు అడ్డుకున్నారు. జగనన్న సురక్ష కార్యక్రమంలో పాల్గొన్న జోగారావు.. తిరిగి వెళ్తుండగా.. కొందరు యువకులు ఆయన వాహనానికి అడ్డుపడ్డారు. అధికారులకు ఎన్ని సార్లు చెప్పినా సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చెందిన నలుగురిని రూరల్ పోలీస్‌స్టేషన్‌కి తరలించారు. అందులో జనసేన పార్టీకి చెందిన వారు ముగ్గురు ఉండగా.. తెలుగుదేశం పార్టీకి చెందిన వారు ఒకరు ఉన్నారు . దీంతో విషయం తెలుసుకున్న ఇరు పార్టీల నాయకులు రూరల్ స్టేషన్ చేరుకొని పోలీసులతో చర్చించారు. విధులకు ఆటంకం కలిగించినందుకు ముందు జాగ్రత్త చర్యలో భాగంగా నలుగురిని స్టేషన్‌కి తరలించామని.. అనంతరం వ్యక్తిగత పూచికత్తుపై వారిని విడిచిపెట్టినట్లు సీఐ స్వామి తెలిపారు.
TAGGED:
జగనన్న సురక్షలో నిలదీత