మున్సిపల్ కార్యాలయం ఎదుట గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం నిరసన - ఏపీ లేటెస్ట్ న్యూస్
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 12, 2023, 1:29 PM IST
Village Ward Secretariat Employees Protest: పల్నాడు జిల్లాలోని పిడుగురాళ్ల మున్సిపల్ కార్యాలయం ఎదుట గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం నిరసన చేపట్టింది. పిడుగురాళ్ల పట్టణంలో 16వ వార్డు సచివాలయ ఉద్యోగి ఆకుల అశోక్‌పై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు.
Councilor Husband Attack on Secretariat Employee: వార్డ్ ఎమినిటీ కార్యదర్శి పొట్లూరి ఫణీంద్రపై స్థానిక వార్డు కౌన్సిలర్ షేక్ మున్నీర్ భర్త షేక్ సైదావలి దురుసుగా ప్రవర్తిస్తుండగా అక్కడే నిలబడి ఉన్న వార్డ్ శానిటరీ సెక్రటరీ ఎ.అశోక్ జరుగుతున్న ఉదంతాన్ని సెల్ ఫోన్లో వీడియో తీశాడు. అది గమనించిన షేక్ సైదావలి తన ఫోన్‌తో అశోక్ తలపై కొట్టి గాయపరిచాడు. దీంతో ఈ ఘటనపై ఏపీ గ్రామ వార్డు సచివాలయ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు షేక్ అబ్దుల్ రజాక్ బాధితుడితో కలిసి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయినా కూడా అధికారులు నిందితుడిపై చర్యలు తీసుకోకపోవడంతో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం నిరసన చేపట్టింది.