విజ్ఞానవంతమైన సమాజాన్ని సృష్టించడంలో పుస్తకాలే కీలకం: కేంద్ర సాహిత్య అకాడమీ ఛైర్మన్ - పుస్తక పఠనం
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 29, 2023, 3:41 PM IST
Vijayawada Book Festival : దేశంలో ఎన్నో పుస్తక ప్రదర్శనలు దిగ్విజయంగా కొనసాగుతున్నాయంటే అందుకు కారణం పాఠకుల ఆదరణ, వారిలోని పఠనాశక్తి అని ప్రముఖ రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షులు మాధవ్ కౌశిక్ పేర్కొన్నారు. పుస్తక ప్రదర్శనలు ప్రతి సంవత్సరం పెరుగుతున్నాయని విజ్ఞానవంత సమాజాన్ని సృష్టించడంలో పుస్తకాలే కీలకమని అన్నారు.
Kendra Sahitya Akademi Chairman Madhav Koushik attend to Book Festival: 34వ విజయవాడ పుస్తక మహోత్సవం గురువారం విజయవాడ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఘనంగా ప్రారంభమైంది. కేంద్ర సాహిత్య అకాడమీ ఛైర్మన్ మాధవ్ కౌశిక్ ఈ మహోత్సవానికి శ్రీకారం చుట్టారు. జనవరి ఏడో తేదీ వరకు జరిగే ఈ పుస్తక మహోత్సవం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ప్రస్తుత స్మార్ట్ ఫొన్ ప్రపంచంలో పుస్తక పఠనానికి అవకాశాలు పెరిగాయని ఒక్క చరవాణిలోనే మొత్తం గ్రంథాలయాలు ఉంటున్నాయని పేర్కొన్నారు. స్టార్ట్ఫోన్లు నేటి తరాన్ని పుస్తక పఠనానికి దూరం చేస్తున్నాయంటే తాను అంగీకరించబోనని ఈటీవీ భారత్ ముఖాముఖిలో తెలిపారు. ఈ పుస్తక ప్రదర్శనకు వేలాది పుస్తక ప్రియులు విచ్చేసి మది దోచే రచనలను సొంతం చేసుకున్నారు.