Electric Shock: విద్యుత్ షాక్‌తో రెండేళ్ల చిన్నారి మృతి.. - గుత్తి మండలం లేటెస్ట్ న్యూస్
🎬 Watch Now: Feature Video
Two Years Old Child Electric Shock: అనంతపురం జిల్లా గుత్తి మండలంలో విషాదం చోటుచేసుకుంది. కరెంట్ షాక్‌తో రెండేళ్ల చిన్నారి మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. మండల పరిధిలోని ఊబిచర్ల గ్రామంలో సంతోష్ అనే చిన్నారి తన ఇంటి పరిసరాల ప్రాంతాలలో ఆడుకుంటుండగా.. విద్యుత్ స్తంభానికి ఉన్న స్టాటర్ బాక్స్ తగిలి కరెంట్ షాక్‌కు గురయ్యాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు చిన్నారిని హుటా హుటిన చికిత్స నిమిత్తం గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే చిన్నారిని పరీక్షించిన వైద్యులు.. అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో చిన్నారి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. చిన్నారి మృతితో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ విషాదకర ఘటన జరిగిందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. స్టాటర్ బాక్స్‌పై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా.. జాగ్రత్తలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.