TTD MOU With the Singhania Group: మహారాష్ట్రలో శ్రీవారి ఆలయం.. రూ. 70 కోట్లతో నిర్మించనున్న సింఘానియా గ్రూపు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 10, 2023, 7:15 PM IST
TTD MOU With the Singhania Group: నవీ ముంబైలో శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి సింఘానియా గ్రూపుతో తితిదే ఎంఓయూ కుదుర్చుకుంది. తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో ఈవో ధర్మారెడ్డి, రేమండ్ గ్రూప్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్ హరి సింఘానియా సమక్షంలో ఈ మేరకు ఒప్పందం జరిగింది. అనంతరం ఈవో మీడియాతో మాట్లాడారు. ముంబాయి ఉల్వే ప్రాంతంలో మహారాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన 10 ఎకరాల భూమి కేటాయించిందని తెలిపారు. ఆ భూమిలో రూ.70 కోట్లతో శ్రీవారి ఆలయాన్ని నిర్మించేందుకు దాత ముందుకు వచ్చారని తెలిపారు. ఈ ఆలయ నిర్మాణాన్ని త్వరలో ప్రారంభిస్తామని ఈవో తెలిపారు. నిర్మాణ పనులు ఏడాది కాలంలో పూర్తి చేస్తామని ఆయన చెప్పారు. కార్యక్రమంలో సీఈ నాగేశ్వరరావు, శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, డిప్యూటీ ఈవో (డోనర్ సెల్) సెల్వం తదితరులు పాల్గొన్నారు.
'నవీ ముంబయిలో ఉల్వే ప్రాంతంలో మహారాష్ట్ర ప్రభుత్వం 10 ఎకరాల భూమి కేటాయించింది. ఆ ప్రాంతంలో రూ.70 కోట్లతో శ్రీవారి ఆలయాన్ని నిర్మించేందుకు దాత ముందుకు వచ్చారు. ఈ ఆలయ నిర్మాణాన్ని త్వరలోనే ప్రారంభించి ఏడాది కాలంలో పూర్తి చేస్తామని నిర్వాహకులు వెల్లడించారు. 'ధర్మారెడ్డి, తితిదే ఈవో