TTD Brahmotsavams 2023 : కల్పవృక్షంపై భక్తులకు దర్శమిస్తున్న మలయప్ప స్వామి - తిరుమల దేవాస్థానం వార్తలు
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/21-09-2023/640-480-19568915-thumbnail-16x9-tirumala-bramhostavam.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 21, 2023, 4:21 PM IST
TTD Brahmotsavams 2023 : తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగా వైభవంగా సాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు ఉదయం రాజమన్నార్ అలంకారంలో శ్రీదేవి, భూదేవి సమేతుడైన మలయప్ప స్వామి మాఢ వీధుల్లో ఉయ్యాలలో విహరిస్తూ భక్తులకు దర్శమిచ్చారు. గజరాజులు,అశ్వాలు ముందు నడువగా కల్పవృక్షవాహనంపై ఆసీనులైన మలయప్ప స్వామి భక్తులకు దర్శనమిస్తూ.. మాఢవీధుల్లో విహరించారు.
క్షీరసాగర మధనంలో ఉద్భవించిన అతి విలువైన కల్పవృక్షంపై అధిరోహించి మాఢవీధుల్లో విహరించే స్వామివారిని దర్శించుకొంటే కోరిన కోర్కెలు తీరతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. శ్రీవారిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలివచ్చారు. స్వామివారి వాహనసేవ ముందు వివిధ రాష్ట్రాల నుంచి తరలివచ్చిన కళాకారులు తమ విభన్న ప్రదర్శనలతో భక్తులను విశేషంగా ఆకట్టుకున్నారు. మాఢ వీధుల్లో కల్పవృక్ష వాహనంపై ఊరేగుతున్న స్వామివారికి.. భక్తులు కర్పూర హారతులు సమర్పించి.. మొక్కులు చెల్లించుకొన్నారు. వాహన సేవలో పాల్గొనేందుకు వచ్చిన భక్తులతో మాఢ వీధులు కిటకిటలాడాయి. గురవారం రాత్రి 7గంటలకు సర్వభూపాల వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.