గుంటూరు-కాచిగూడ ట్రైన్ రద్దుతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలు - పునరుద్ధరించాలని డిమాండ్ - Prakasam District News
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 17, 2023, 8:24 PM IST
Troubles of Giddaluru Peoples Cancellation of Train : గుంటూరు-కాచిగూడ ట్రైన్ రద్దుతో ప్రకాశం జిల్లా గిద్దలూరు పరిసర ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డబ్లింగ్ పనుల కారణంగా ఈ మార్గం గుండా అధికారులు పలు రైళ్లు రద్దు చేశారు. రెండు నెలలు గడుస్తున్న పనులు పూర్తి కాకపోవడంతో స్థానికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మిగతా ఎక్స్‌ప్రెస్ రైళ్లు అన్నీ రాత్రిపూట తిరుగుతున్నాయి. ఒక్క గుంటూరు - కాచిగూడ ట్రైన్ మాత్రమే రద్దు చేయడానికి కారణం ఏంటని ఇక్కడి ఉద్యోగులు, విద్యార్థులు, ఉపాధి కోసం వెళ్లే వాళ్లు అధికారులను ప్రశ్నిస్తున్నారు.
గిద్దలూరు నుంచి కాచిగూడకు రైలులో వెళ్లాలంటే రూ. 200 ఖర్చు అవుతుంది. ఇప్పుడు ట్త్రెన్ రద్దుతో ప్రైవేట్ ట్రావెల్స్, ఆర్టీసీ బస్సుల్లో వెళ్లాలంటే ఒక్కరికి సుమారుగా రూ. 2000 ఖర్చు అవుతుందని ప్రజలు వాపోతున్నారు. ఇక కుటుంబంతో వెళ్లాలంటే రూ. 10000 వరకు ఖర్చు అవుతుందని తెలిపారు. చాలా మంది ఉపాధి కోసం హైదరాబాదుకు వెళుతుంటారు వీరు ఈ ఖర్చును భరించలేక ఇక్కడే ఉండిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో కుటుంబ ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రాత్రిపూట నడిచే గుంటూరు - కాచిగూడ ఎక్స్‌ప్రెస్ రైలును పునరుద్ధరించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.