The police crushed the youth to confess the crime యువకుడిపై కానిస్టేబుల్ దాష్టీకం.. నడవలేని స్థితిలో ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న బాధితుడు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 4, 2023, 11:12 AM IST
The police crushed the youth to confess the crime గొర్రెలను దొంగతనం చేసినట్లు ఒప్పుకోవాలంటూ పోలీసు కానిస్టేబుల్ తనను అకారణంగా చితకబాదినట్లు ఓ గొర్రెల కాపరి ఆరోపించారు. నడవలేని పరిస్థితిలో ఉన్నానని అతను వాపోయారు. ఈ ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. అతను చికిత్స కోసం ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి.. విలేకరులతో మాట్లాడారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని వజ్రకరూరు మండలం తట్రకల్లు గ్రామానికి చెందిన యువకుడు సురేశ్ గొర్రెలు పెంచుతూ జీవించేవారు. తట్రకల్లు వాసి తిప్పయ్య గొర్రెలను తాను ఎత్తుకెళ్లినట్లు ఫిర్యాదు ఇచ్చాడని, స్టేషన్‌కు రావాలని వజ్రకరూరు పోలీసు స్టేషన్‌లో పని చేస్తున్న ఓ కానిస్టేబుల్ సోమవారం ఫోన్ చేసినట్లు సురేశ్ తెలిపారు.
కానిస్టేబుల్ సూచన మేరకు స్టేషన్‌కు వెళ్లానని.. విధుల్లో ఉన్న కానిస్టేబుల్ నాగరాజు తనను బూటు కాలితో కాళ్లపై తొక్కుతూ గొర్రెలు దొంగతనం చేసినట్లు అంగీకరించాలని ఇబ్బందులు పెట్టాడని తెలిపారు. తాను చోరీ చేయలేదని, తనకు చెందిన రెండు జీవాలు కూడా చోరీకి గురయ్యాయని చెప్పినా వినిపించుకోలేదని వాపోయారు. నడవడానికి కూడా చేతకావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై గుంతకల్లు డీఎస్పీ నర్సింగప్ప, ఉరవకొండ గ్రామీణ సీఐ శేఖర్ విచారణ చేసినట్లు తెలిసింది. బాధితున్ని టీడీపీ పార్లమెంటు సహాయ కార్యదర్శి సుధాకర్‌తో పాటు నాయకులు సుధాకర్ పరామర్శించారు.
దొంగతనం చేయకున్న చేసినట్లు ఒప్పుకోవాలని ఒత్తిడి తీసుకొస్తూ కొట్టడం దారుణమని.. ఇది ఏంటని ఎస్ఐని అడుగగా దురుసుగా మాట్లాడారని సురేష్ బంధువులు ఆరోపించారు.
TAGGED:
పోలీసు కానిస్టేబుల్ దాష్టీకం