Teachers Union Demand to Cancel CPS: 'సీపీఎస్ మాకొద్దు..' రద్దు చేసే వరకు పోరుబాట తప్పదంటూ ఉపాధ్యాయ సంఘాల హెచ్చరిక
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 25, 2023, 7:31 AM IST
Teachers Union Leaders Demand Cancellation of CPS: అధికారంలోకి వచ్చిన వెంటనే సీపీఎస్ రద్దు చేస్తానన్న హామీని ముఖ్యమంత్రి జగన్ నిలబెట్టుకోవాలంటూ ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. గవర్నర్ ఆర్డినెన్స్ ద్వారా జీపీఎస్‌ను అమలు చేయాలని ప్రభుత్వం చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 6 రాష్ట్రాలలో పాత పెన్షన్ విధానం పునరుద్ధరించారని.. వైసీపీ ప్రభుత్వం మాత్రం జీపిఎస్ మాత్రమే ఆదర్శమని చెబుతోందని ఇంతకంటే దారుణం మరొకటి ఉండదన్నారు. పది శాతం కంట్రీబ్యూషన్ కట్టించుకునే జీపీఎస్ విధానం ఏ విధంగా మెరుగైనదో.. రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలంటూ ప్రశ్నించారు. ప్రభుత్వం తీసుకువస్తున్న గ్యారంటీ పెన్షన్ విధానానికే గ్యారంటీ లేదని ఎద్దేవా చేశారు. జగన్ ప్రతిపక్ష నాయకుడిగా సీపీఎస్‌పై ఎన్నో బూటకపు హామీలు ఇచ్చారని కానీ, వాటిని గాలికి వదిలేశారని అన్నారు. ప్రభుత్వం సీపీఎస్‌ను రద్దు చేయాలని, లేకపోతే మరోక బీఆర్టీఎస్ పోరాటం తప్పదని స్పష్టం చేశారు. ఎలాంటి పోరాటాలకైనా తాము సిద్ధంగా ఉన్నామని ఉపాధ్యాయ సంఘాల నేతలు హెచ్చరించారు.