Nara Brahmani Tweet On AP Industries : ఏపీ నుంచి పరిశ్రమలు ఎందుకు తరలిపోతున్నాయి.. వైసీపీ ప్రభుత్వ ఎజెండా ఏమిటి? : బ్రాహ్మణి
🎬 Watch Now: Feature Video
TDP Nara Brahmani Tweet On Industries : రాష్ట్రం నుంచి పరిశ్రమలు తరలిపోవడంపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ నారా బ్రాహ్మణి తనదైన శైలిలో ట్వీట్ చేశారు. కొత్తగా పరిశ్రమలు రాకపోగా.. గత ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్‌ను ఎంచుకుని.. వైసీపీ పాలనలో తిరిగి వెళ్లిపోతున్న వైనాన్ని ఎత్తి చూపుతూ సందేహాలు లేవనెత్తారు.
ఇతర రాష్ట్రాల అభివృద్ధి అజెండాగా ఏపీ ప్రభుత్వం ఎందుకు పనిచేస్తోందని నారా బ్రాహ్మణి ఆక్షేపించారు. పెట్టుబడిదారులు 'పుష్ అవుట్, పుల్ ఇన్' సూత్రంలో భాగంగా ఏపీ నుంచి తరిమివేయబడి తెలంగాణ కు లాక్కోబడుతున్న ఆంతర్యం ఏమిటి? అని ట్విటర్ వేదికగా ఆమె ప్రశ్నించారు. జగన్ పాలనలో చాలా పరిశ్రమలు రాష్ట్రాన్ని విడిచివెళ్లడం దీనిని రుజువు చేస్తున్నాయని తెలిపారు. రాష్ట్రం నుంచి అమర్‌రాజా, లులు.. తెలంగాణకు తరలిపోయాయని గుర్తు చేశారు. చంద్రబాబు పాలనలో రాష్ట్రం నంబర్ వన్ స్థానంలో నిలిచిందని, సులభతర వ్యాపారం, నైపుణ్యాభివృద్ధి రంగంలో రాష్ట్రాన్ని చంద్రబాబు అగ్రస్థానంలో నిలిపారని బ్రాహ్మణి తెలిపారు. లులు, అమర్‌రాజా కంపెనీలు రాష్ట్రం నుంచి తరలిపోవడంపై ‘ది ప్రింట్’ వెబ్‌సైట్‌లో వచ్చిన కథనాన్ని బ్రాహ్మిణి తన ట్వీట్‌కు జత చేశారు.