TDP Leaders Visited Kakinada JNTU Skill Training Centre: కాకినాడ జేఎన్టీయూ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను సందర్శించిన టీడీపీ నేతలు - Kakinada JNTU Skill Training Centre news
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13-09-2023/640-480-19505150-thumbnail-16x9-tdp-leaders.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 13, 2023, 9:28 PM IST
TDP Leaders Visited Kakinada JNTU Skill Training Centre: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిని జగన్ ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేసిన నేపథ్యంలో.. ఆ పార్టీ నేతలు బుధవారం నాడు కాకినాడ జిల్లా జేఎన్టీయూలో ఏర్పాటు చేసిన స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ని సందర్శించారు. సందర్శనలో భాగంగా శిక్షణ కేంద్రంలోని విద్యార్థులతో మాట్లాడారు. అనంతరం కంప్యూటర్ పరికరాలు పరిశీలించిన నేతలు.. టీడీపీ హయాంలో కాకినాడ జేఎన్టీయూలో ఆనాడు చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేశారని గుర్తు చేశారు.
Former MLA Verma comments: ఈ సందర్భంగా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ మాట్లాడుతూ..''టీడీపీ హయంలో కాకినాడ జేఎన్టీయూలో చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేసిన స్కిల్ ట్రైనింగ్ సెంటర్‌ని సందర్శించాము. శిక్షణ కేంద్రంలో తరగతులు జరుగుతున్నాయి. విద్యార్థులను శిక్షణ గురించి, వసతుల గురించి వారితో మాట్లాడి తెలుసుకున్నాము. కేంద్రంలోని కంప్యూటర్ పరికరాలను పరిశీలించాము. ఈ నైపుణ్య శిక్షణ కేంద్రం వల్ల లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. కావాలనే చంద్రబాబుని జైల్లో పెట్టారు. కావాలనే కక్షపూరితంగా ఈ కేసులో ఆయనను ఇరికించి..ఈరోజు జైలుకు పంపించారు. ఎక్కడా అవినీతి జరగలేదు'' అని ఆయన అన్నారు.