TDP Leaders Protest In West Godavari : 'పశ్చిమ'లో టీడీపీ నేతల నిరసన... 'గడప గడపకు బాబుతో నేను' - TDP Leaders Protest In West Godavari
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 19, 2023, 12:29 PM IST
TDP Leaders Protest In West Godavari Babu Tho Nenu : టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ.. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పార్టీ శ్రేణులు ప్రత్యేక పూజలు, ర్యాలీలు చేశారు. అనకాపల్లి జిల్లాలో పార్టీ నాయకులు బాబు అరెస్ట్‌కు నిరసనగా.. సైకో పోవాలి సైకిల్ రావాలని నినాదాలు చేస్తూ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరులో స్థానిక మహిళలు బాబుతో నేను కరపత్రాలను పంపిణీ చేస్తూ.. బాబుకు మద్దతుగా నిలిచారు. విజయనగరం జిల్లాలో పార్టీ నాయకులు మార్కెట్‌లో చంద్రబాబుకు మద్దతుగా కరపత్రాలు పంపిణీ చేశారు.
TDP Leaders Babu Tho Nenu : తూర్పుగోదావరి జిల్లా వెలగదుర్రులో టీడీపీ నాయకులు.. మహాత్మా గాంధీ, ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. శ్రీ సత్య సాయి జిల్లాలో చంద్రబాబు ఆరోగ్యంగా ఉండాలని లేపాక్షి దుర్గా పావనేశ్వర ఆలయంలో 101 కొబ్బరికాయలు కొట్టి.. ప్రత్యేక పూజలు చేశారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో గద్దెరాళ్ల మారెమ్మ ఆలయంలో 101 కొబ్బరికాయలు కొట్టి నిరసన తెలిపారు. బాపట్ల జిల్లాలో సైకో పోవాలి... సైకిల్ రావాలని నినాదాలు చేస్తూ టీడీపీ కార్యకర్తలు పార్టీ జెండాలతో చెరువులో దిగి జలదీక్ష చేశారు.