TDP Leaders Complained about Votes Deletion కాకినాడలో 52 వేల 941 ఓట్లు తొలగించేందుకు దరఖాస్తులు.. కలెక్టర్​కు ఫిర్యాదు చేసిన టీడీపీ నేతలు - Votes Deletion

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 8, 2023, 8:38 PM IST

TDP Leaders Complained about Votes Deletion: కాకినాడ జిల్లాలో తెలుగుదేశం సానుభూతిపరుల ఓట్లను వైసీపీ నాయకులు తొలగిస్తున్నారని తక్షణమే వాటిని నియంత్రించాలంటూ టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు వనమాడి కొండబాబు, ఎస్‌.వి.ఎస్‌.ఎన్‌ వర్మ కలెక్టర్​కు ఫిర్యాదు చేశారు. కాకినాడ జిల్లా వ్యాప్తంగా 52 వేల 941 ఓట్లు తొలగించేందుకు నకిలీ ఫారమ్ 7లను ఆన్​లైన్​లో దరఖాస్తు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అత్యధికంగా కాకినాడ నగర నియోజకవర్గంలోనే 20 వేల 159 ఓట్లను తలగించేందుకు నకిలీ ఫారమ్7 దరఖాస్తు చేసినట్టు కలెక్టర్​కు టీడీపీ నాయకులు చెప్పారు. వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, అతని అనుచరులు.. తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుల ఓట్లు తొలగించేందుకు ఆన్​లైన్​లో నకిలీ దరఖాస్తులు పొందుపరిచారని అన్నారు. పిఠాపురం నియోజవర్గంలో 5 వేల 734 ఓట్లను తొలిగించేందుకు దరఖాస్తు చేశారన్నారు. తప్పుడు చర్యలకు అధికారులు సహకరించడంవల్ల వారే బలవుతారని గుర్తించాలని చెప్పారు. అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించి కాకినాడ జిల్లా పరిధిలో ఓటర్ జాబితా నుంచి తొలగించిన పేర్లను తిరిగి చెల్లుబాటు అయ్యేలా చూడాలని ఎన్నికల కమిషనర్‌ని టీడీపీ నాయకులు కోరారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.