Vangalapudi Anitha Comments: సీఎం కనుసన్నల్లోనే.. మహిళలపై అసభ్యకర పోస్టులు..! - టీడీపీ నేత వంగలపూడి అనిత కామెంట్స్
🎬 Watch Now: Feature Video
Vangalapudi Anitha Comments: టీడీపీ మహిళలు, కార్యకర్తలపై సోషల్ మీడియాలో పెట్టే అసభ్యకర కామెంట్స్, పోస్టింగ్స్, మార్ఫింగ్ ఫోటోలు, వీడియోలు.. మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌కు కనిపించడంలేదా అని.. తెలుగుమహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ప్రశ్నించారు. బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్నవారు, ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సినవారు.. నాణేనికి ఒకవైపే చూసి మాట్లాడటం సరికాదన్నారు. మహిళలకు జరిగే అవమానాలు, వేధింపులపై మాట్లాడితే తెలుగుదేశం అధినేత చంద్రబాబుని అనరాని మాటలంటారా అని మండిపడ్డారు. సామాజిక మాధ్యమాల్లో అసభ్య పోస్టులు పెడుతున్న వర్ర రవీంద్ర రెడ్డి.. సీఎం జగన్, అతని భార్య భారతి కన్నుసన్నల్లోనే పనిచేస్తున్నాడని ఆరోపించారు. అందుకే అతడిపై చర్యలు తీసుకునేందుకు మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ వెనుకాడుతున్నారని విమర్శించారు. రవీంద్రరెడ్డి. ఫేస్బుక్ చూశాక ఒక మహిళగా.. ఆమె స్పందన ఎలా ఉంటుందో చూడాలనుకుంటున్నామన్నారు. రవీంద్రరెడ్డి లాంటి వారు వైసీపీలో చాలామంది ఉన్నారనీ, వారందరిపై డీజీపీ ఏం చర్యలు తీసుకుంటారని అనిత ప్రశ్నించారు. ఆడబిడ్డల గురించి అసభ్యకరంగా మాట్లాడుతున్న రవీంద్రరెడ్డి భవిష్యత్‌లో దారుణమైన పర్యవసానాలు ఎదుర్కొంటాడనీ హెచ్చరించారు. రవీంద్రరెడ్డితో దిగిన ఫోటోలపై భారతి రెడ్డి ఏం సమాధానం చెబుతారనీ దుయ్యబట్టారు.