నిరుద్యోగిత రేటులో ఏపీ బిహార్‌ను మించిపోయింది: పట్టాభి - Andhra Pradesh news NEWS
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 13, 2023, 6:15 PM IST
|Updated : Dec 13, 2023, 8:00 PM IST
TDP Leader Pattabhi on State Unemployment Rate: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలనలో దేశంలోనే అత్యంత నిరుద్యోగిత రేటు ఆంధ్రప్రదేశ్‌లో నమోదైందని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అన్నారు. నిరుద్యోగిత రేటు విషయంలో ఏపీ బిహార్‌ను మించిపోయిందని ఆయన గుర్తు చేశారు. తాడేపల్లి కొంపకు కమీషన్లు కట్టలేక, ప్రభుత్వ అవినీతి, వైసీపీ నేతల వేధింపుల కారణంగా రాష్ట్రానికి పెట్టుబడులు రాలేకపోయానని, దీంతో నిరుద్యోగిత రేటు వెనకబడిపోయిందని పట్టాభిరామ్ ధ్వజమెత్తారు.
Pattabhi Comments: ''రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చదువుకున్న యువతకు తక్షణమే ఉద్యోగాలు దొరికేవి. రాష్ట్రానికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులు, పరిశ్రమలు వచ్చేవి. తద్వారా అనేక రకాల ఉద్యోగాలు సృష్టింపబడేవి. కానీ, ఇవాళ జగన్ పరిపాలనలో పెట్టుబడులు, పరిశ్రమలు, ఉద్యోగాలే లేవు. తాజా గణాంకాల ప్రకారం ఈ నాలుగేళ్ల పరిపాలనలో సీఎం జగన్ చంద్రబాబు నాయుడు సాధించిన పెట్టుబడుల్లో సగానికి సగం మాత్రమే పెట్టుబడులు తీసుకొచ్చారు. అంటే 50 శాతం పెట్టుబడుల్ని మనం కోల్పోయాం. ఏటా జనవరిలో జాబ్ క్యాలెండర్, డీఎస్సీ ప్రకటన వంటి హామీలతో పాటు, యువనేస్తం పేరుతో చంద్రబాబు అందించిన నిరుద్యోగ భృతికి జగన్ మంగళం పాడారు. ఉపాధి కల్పన చేతగాని జగన్‌రెడ్డి, రాష్ట్ర యువతను అతని వ్యాపార వస్తువులుగా మార్చి గంజాయి, డ్రగ్స్ వంటి మాదక ద్రవ్యాలకు బానిసల్ని చేశారు'' అని టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అన్నారు.