వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ల మార్పుపై టీడీపీ నేత విమర్శ
🎬 Watch Now: Feature Video
TDP leader Dhulipalla Narendra made comments on Twitter: వైఎస్సార్సీపీ 11 నియోజకవర్గాలకు సంబంధించిన ఇన్ఛార్జిలను మార్చడంపై టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర ఎక్స్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని మార్చాలని ప్రజలు డిసైడ్ అయిన తరువాత ఎంత మందిని మార్చినా ఫలితం సున్నా అని ఎద్దేవా చేశారు. ప్రజా వ్యతిరేకత ఉందని అభ్యర్థులను మార్చుకుంటూ ఉంటే పులివెందులతో సహా మొత్తం 151 మందిని మార్చాల్సి వస్తుందని ఆయన ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
YCP Government changing the in-charges 11 constituency: సార్వత్రిక ఎన్నికల ముంగిట వైఎస్సార్సీపీ అధిష్ఠానం నియోజకవర్గాలకు కొత్తగా సమన్వయకర్తలను నియమించిన విషయం తెలిసిందే. నియోజకవర్గాలకు కొత్తవారిని సమన్వయకర్తలుగా నియమించటం అనేది రాజకీయంగా ఎంతో ప్రాధాన్యం సంతరించుకుంది. అమరావతి రాజధాని మార్పు, మూడు రాజధానులకు అనుకూలంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి ఉమ్మడి గుంటూరు జిల్లాలో వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్నాయి. ఆ ప్రభావం ఎన్నికల్లో ఉంటుందని వైఎస్సార్సీపీ నాయకుల్ని భయం వెంటాడుతున్నట్లు తెలుస్తోంది.