Perni Nani blackmailing అక్రమ చేపల చెరువుల కోసమే కలెక్టర్‌ను పేర్ని నాని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు: కొల్లు - ఏలూరు కలెక్టర్
🎬 Watch Now: Feature Video
Perni Nani blackmailing collector: కైకలూరులో పేర్ని నాని అక్రమ చెరువుల కోసమే కలెక్టర్ ను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. నిషేధిత భూముల్లో పేర్ని నాని యథేచ్ఛగా చేస్తున్న అక్రమ తవ్వకాలకు అడ్డు రాకుండా కలెక్టర్ ను జడ్పీ మీటింగ్ ద్వారా బ్లాక్ మెయిల్ చేశారని ధ్వజమెత్తారు. బందరులో పేర్ని నాని కొడుకు రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. గడచిన నాలుగున్నర సంవత్సరాలుగా పేర్ని నాని ఎన్నిసార్లు బందరులో పర్యటించారు..? ఎన్ని సమస్యలు పరిష్కరించారో చెప్పాలని నిలదీశారు. జిల్లా ఇంచార్జ్ మంత్రి రోజా పర్యాటక మంత్రిగా ఉండి కనీసం బీచ్ కు కూడా అభివృద్ధి నిధులు తెచ్చు కోలేరా అని దుయ్యబట్టారు. అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకుండా బీచ్ లో ఉన్న మట్టిని తరలిస్తున్నారని ఆరోపించారు. బందరులో ఉన్న అన్ని వనరుల్ని దోచేసి.. ఇప్పుడు కైకలూరు మీద పడ్డారని.. దాని దృష్టిని మరల్చేందుకు జడ్పీ సమావేశానికి కలెక్టర్ రాలేదని హడావుడి చేస్తూ బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని మండిపడ్డారు.