అధ్వాన రోడ్లతో తిప్పలు - జగన్​ను గద్దె దించడానికి ప్రజలు సిద్ధమయ్యారన్న టీడీపీ-జనసేన నేతలు - పేరుపాలెం మోదీ రహదారిపై టీడీపీ జనసేన నాయకులు ధర్నా

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 23, 2023, 3:50 PM IST

TDP Janasena Leaders Dharna in West Godavari District : పశ్చిమగోదావరి జిల్లాలో ఆధ్వాన్నంగా ఉన్న రోడ్లకు మరమ్మతులు చేయాలంటూ మొగల్తూరు మండలం పేరుపాలెం-మోదీ రహదారిపై టీడీపీ-జనసేన నాయకులు ధర్నా చేపట్టారు. వైసీపీ పాలనలో మోసపూరిత హామీలు, కక్ష పూరిత రాజకీయాలే తప్ప ఎక్కడా అభివృద్ధి లేదని ఇరు పార్టీ నేతలు మండిపడ్డారు. నరసాపురం నియోజకవర్గంలో రూ. 3200 కోట్లు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి జగన్ శంకుస్థాపన చేసి ఏడాది గడిచినా ఇప్పటికీ పునాదికి కూడా పనులు నోచుకోలేదని టీడీపీ నేత పోత్తురి రామరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే టీడీపీ-జనసేన పార్టీలకు ప్రజలు అండగా నిలవాలన్నారు. ప్రభుత్వానికి రోడ్లపై కంకర పోసే పరిస్థితి లేదా అని ప్రశ్నించారు. జగన్ ముఖ్యమంత్రిగా అధికార బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక రోడ్డు కూడా వేయలేదని ధ్వజమెత్తారు. అధ్వానమైన రోడ్లతో ఆటో, ట్యాక్సీ వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. ఈ ప్రభుత్వ పాలనలో అన్ని వర్గాల ప్రజలు నష్టపోతున్నారని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో జగన్​ను గద్దె దించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు.  

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.