TDP Leader Tangirala Sowmya Fires On YCP ఈ ప్రభుత్వానికి టాయిలెట్స్ నిర్మించడం కూడా రాదు.. : టీడీపీ నేత తంగిరాల సౌమ్య - నందిగామలో టాయిలెట్ల సమస్య

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 16, 2023, 5:22 PM IST

TDP Ex MLA Tangirala Sowmya Fires On YCP: వైయస్సార్​ కాంగ్రెస్​ ప్రభుత్వానికి టాయిలెట్స్ నిర్మించడం కూడా తెలియదని మాజీ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య ఎద్దేవా చేశారు. అధికార పార్టీ నేతల అనాలోచిత నిర్ణయాలతో నందిగామకు గ్రహణం పట్టిందని ఆమె అన్నారు. వైసీపీ ఏ పని చేపట్టినా.. అది వివాదాస్పదమై అని ఆమె ఆరోపించారు. నేడు నందిగామలో పర్యటించిన తంగిరాల సౌమ్య.. టీడీపీ కౌన్సిలర్లు, నాయకులతో కలిసి పట్టణంలోని టీటీడీ కళ్యాణ మండపం, రామన్నపేట బస్టాండ్ వద్ద   ఏర్పాటు చేసిన టాయిలెట్స్​ను పరిశీలించారు. కళ్యాణ మండపం గేట్ ఎదురుగా టాయిలెట్స్​ నిర్మించడం అంటే ప్రజల నమ్మకాలను ఆ గౌరవ పరచడమే అని ఆమె అన్నారు. ఈ నిర్మాణానికి ఎవరు అనుమతులు ఇచ్చారని సౌమ్య ప్రశ్నించారు. అభివృద్ధిని అడ్డుకుంటున్నారంటూ టీడీపీపై నిందలు వేసే చౌకబారు ఎత్తుగడలు మాని.. తక్షణమే ఈ టాయిలెట్స్ ఎక్కడ ఉంచితే ప్రయోజనం కలుగుతుందో ప్రజాభిప్రాయం తీసుకొని, సక్రమమైన డ్రైనేజీ ఉన్నచోట నిర్మించవలసిందిగా అధికారులను ఆమె డిమాండ్ చేశారు. అనంతరం రామన్నపేట రోడ్డులో గల జిల్లా కోర్టు వద్ద నిర్మిస్తున్న కల్వర్టును పరిశీలించిన సౌమ్య.. ఆ రహదారిలో వెళ్లే వాహనదారులు పడుతున్న అవస్థలను.. అడిగి తెలుసుకున్నారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.