విజయవాడలో డ్రగ్స్ కలకలం - సింథటిక్ డ్రగ్‌తో సెబ్ అధికారులకు పట్టుబడ్డ యువకుడు - విజయవాడ లేటెస్ట్ న్యూస్
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 25, 2023, 12:33 PM IST
Synthetic Drugs Case Accused Arrested: విజయవాడలో డ్రగ్స్ కలకలం రేపుతోంది. 4 గ్రాముల సింథటిక్ డ్రగ్‌తో ఉన్న వ్యక్తిని సెబ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరు నుంచి విజయవాడకు డ్రగ్స్ తెస్తున్నట్లు పక్కా సమాచారంతో గొల్లపూడికి చెందిన ప్రవీణ్ అనే యువకుడిని అదుపులోకి తీసుకుని తమ శైలిలో విచారిస్తున్నారు. నూతన సంవత్సర వేడుకలకు ముందు డ్రగ్స్ దొరకటం చర్చనీయాంశమైంది.
కాగా, ఇటీవల బెంగళూరు నుంచి రాజమహేంద్రవరం తరలిస్తున్న 3.42 గ్రాముల మిథైల్ ఎన్‌డాక్సీ మెథాఫెటామైన్ (M.D.M.A) మత్తుమందును విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ లో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కృష్ణలంక పోలీసులు ఈ నెల 29న బస్ స్టేషన్‌లో తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలో బెంగళూరు బస్సులు నిలుపుదల చేసే ప్లాట్‌ఫారం నంబర్ 7వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న యువకుడిని అదుపులోకి విచారణ చేపట్టారు. విజయవాడ బస్ స్టేషన్ చేరుకున్న క్రమంలో తనిఖీలు చేస్తున్న పోలీసులను గమనించిన యువకుడు పారిపోయేందుకు యత్నించాడు. అతడి వద్ద నుంచి మత్తుమందును స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.