KR Suryanarayana: సూర్యనారాయణ ముందస్తు బెయిల్ పిటిషన్ తిరస్కరణ - సూర్యనారాయణ ముందస్తు బెయిల్ పిటిషన్ తిరస్కరణ
🎬 Watch Now: Feature Video
Suryanarayana Anticipatory Bail Petition Rejected: విజయవాడ పటమట పోలీసులు నమోదు చేసిన కేసులో ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను విజయవాడ ఏడీజే కోర్టు తిరస్కరించింది. తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని సూర్యనారాయణ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు.. ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. పోలీసులు తాజాగా ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ చట్టాన్ని జోడించి ఎఫ్ఐఆర్ను ఆల్టర్ చేసి కోర్టు ముందు ఉంచారు. అయితే పిటిషన్ విచారణ ఈ కోర్టు పరిధికి రాదన్న న్యాయమూర్తి.. ముందస్తు బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించారు. అదే సమయంలో తనపై పటమట పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ.. కేఆర్ సూర్యనారాయణ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపింది. దీనిపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను వాయిదా వేసింది.