Students Works in SPS School: ఇదేం క్రమ'శిక్ష'ణ..! విద్యార్థులతో పారిశుద్ధ్య పనులు.. ప్రధానోపాధ్యాయురాలిపై తల్లిదండ్రుల ఆగ్రహం - AP Latest News
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 1, 2023, 5:01 PM IST
|Updated : Sep 1, 2023, 5:12 PM IST
Students Works in SPS School: గుడివాడలోని ఎస్పీఎస్ మున్సిపల్ పాఠశాలలో విద్యార్థులే పారిశుద్ధ్య పనివాళ్లుగా మారి పనులు చేస్తున్న ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ ఘటనను తల్లిదండ్రులే వీడియో తీసి మీడియాకి పంపించారు. విద్యార్థులచే బాత్రూంలు కడిగించడం, మధ్యాహ్నం భోజనం వడ్డించడం లాంటి పనులను హెడ్మాస్టర్ చేయించడం సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళ్తే కృష్ణా జిల్లా గుడివాడలోని ఎస్పీఎస్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులే పారిశుద్ధ్య పనివాళ్లుగా మారారు. విద్యార్థులు పనివాళ్లుగా మారి పాఠశాలలో వివిధ పనులు చేయడం నిత్యకృత్యంగా మారింది. పాఠశాలలో విద్యార్థులను బ్యాచులుగా ఏర్పాటు చేసిన హెచ్ఎం.. పిల్లలతో బాత్రూంలు కడిగించడం, మధ్యాహ్న భోజనం పంపిణీ చేయడం అలవాటుగా మారింది. ఇదేమిటని పలుమార్లు తల్లిదండ్రులు హెచ్ఎంను ప్రశ్నించగా.. పిల్లలకు క్రమశిక్షణ నేర్పుతున్నామని మాట దాట వేసే వారని చెప్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం విద్యార్థులు బాత్రూంలు కడుగుతున్న వీడియో దృశ్యాలను తల్లిదండ్రులు మీడియాకు పంపారు. ప్రధానోపాధ్యాయురాలిని వివరణ అడిగేందుకు మీడియా ఫోన్ ద్వారా ప్రయత్నించగా.. మీటింగ్లో ఉన్నాననే సమాధానం చెప్పి ఫోన్ కట్ చేశారు.