బయట బిర్యానీ తెచ్చిన తల్లిదండ్రులు - ఆరుగురు గురుకుల విద్యార్థులకు అస్వస్థత
🎬 Watch Now: Feature Video
Students Suffering From Street Food Rushed To Hospital: అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మండలం సమనస గ్రామంలోని బీసీ గురుకుల పాఠశాలలో ఆరుగురు విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. ఆదివారం సాయంత్రం తల్లిదండ్రులు బయట నుంచి తీసుకొచ్చిన బిర్యానిని విద్యార్థులకు ఇచ్చారు. వాళ్లు ఆ రాత్రి బిర్యానీ తిన్న కారణంగా ఉదయానికి వాంతులు, విరోచనాలతో బాధపడుతున్నారు. అయితే విద్యార్థులు ఉన్నట్లు ఉండి ఆకస్మికంగా కళ్లు తిరిగి కింద పడిపోవడంతో వెంటనే స్థానికులు అప్రమత్తమై అమలాపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు.
విద్యార్థులకు వైద్య సేవలు అందిస్తున్నామని ప్రసుత్తం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్ శంకర్రావు తెలిపారు. అమలాపురం జాయింట్ కలెక్టర్ శ్రీవాస్ నుపూర్ అజయ్‌కుమార్ ఏరియా ఆసుపత్రికి వెళ్లి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్‌ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె ఏరియా సూపరింటెండెంట్‌తో మాట్లాడారు. ఈ పరిణామానికి గల కారణాలు తెలుసుకుంటామని జాయింట్ కలెక్టర్ తెలిపారు. విద్యార్థులు ప్రస్తుతం క్షేమంగానే ఉన్నారని అధికారులు వెల్లడించారు.