Stranger Cheated Dwacra Woman: కోనసీమ జిల్లాలో బ్యాంకు ఉద్యోగిని అంటూ డ్వాక్రా మహిళకు టోకరా.. - కోనసీమ జిల్లా లేటెస్ట్ న్యూస్
🎬 Watch Now: Feature Video
Stranger Cheated Dwacra Woman: బ్యాంక్ ఉద్యోగిని అంటూ మాయ మాటలు చెప్పి డ్వాక్రా మహిళకు అపరిచిత వ్యక్తి టోకరా వేశాడు. ఈ సంఘటన అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరంలో చోటు చేసుకుంది. లంకల గన్నవరం గ్రామానికి చెందిన కొప్పడి సత్యవతి అనే మహిళ తమ డ్వాక్రా సంఘానికి సంబంధించిన రుణ వాయిదా 33,000 రూపాయలను, రూ.1,100 పొదుపు.. మొత్తం కలిపి రూ.34,100ను పి.గన్నవరంలోని ఎస్బీఐ బ్రాంచ్లో జమ చేసేందుకు వెళ్లారు. ఆ నగదును బ్యాంకులో జమ చేసేందుకు ఆమె క్యూలో నించున్నారు. ఇంతలో ఓ అపరిచిత వ్యక్తి ఆమె వద్దకు వచ్చి.. తాను బ్యాంకు ఉద్యోగిని అని నమ్మించి డబ్బులు కడతానని చెప్పి ఆమె వద్ద నగదు తీసుకున్నాడు. తర్వాత వాటిని జమ చేసినట్లుగా బ్యాంకు రసీదుపై వివరాలు రాసి నకిలీ బ్యాంకు ముద్ర వేసి ఆమెకి అక్కడి నుంచి ఉడాయించాడు. అనంతరం ఆమె డబ్బులు చెల్లించినట్లు బ్యాంకు సిబ్బందికి చెప్పగా.. అసలు విషయం బయటపడింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి.. సీపీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు.