ప్రభుత్వ ఆసుపత్రిలో భోజన బకాయిలు- బయట నుంచి ఆహారం తెప్పించుకుంటున్న పేషంట్లు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 30, 2023, 1:41 PM IST
Stalled Food Supply in Government Hospital in Konaseema District : కోనసీమ జిల్లా పి.గన్నవరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు సరఫరా చేసే ఆహారం నిలిచిపోయింది. ప్రభుత్వం నుంచి సుమారు 2 లక్షల 50 వేల రూపాయల వరకు బకాయిల రావాలని గుత్తేదారుడు వాపోతున్నారు. ఇంతకాలం అప్పు తెచ్చి సరఫరా చేశామని బిల్లులు రాకపోవడం వల్ల భోజనాల సరఫరా నిలుపుదల చేశామని గుత్తేదారుడు తెలిపారు.
Patients Suffering From Food Shortages : భోజన సరఫరా నిలిచిపోవడం వల్ల రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. దీంతో రోగులు, గర్భణీలు బయట నుంచి భోజనాలు తెచ్చుకుంటున్నారు. అధికారులు స్పందించి తమకు భోజన సౌకర్యాలు కల్పించాలని రోగులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో దాతలు ముందుకు వచ్చి కొంతమందికి ఆహారం అందించారు. వైద్యుడి విజ్ఞప్తి మేరకు నెలరోజుల పాటు ఆహారాన్ని సరఫరా చేయడానికి గుత్తేదారుడు ఒప్పుకున్నాడని ఆసుపత్రి సిబ్బంది తెలియజేశారు. తానుకు రాాావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని గుత్తేదారుడు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.