సీఎస్, డీజీపీతో పాటు పలువురిపై పోలీసులకు సోమిరెడ్డి ఫిర్యాదు - రాజకీయ వార్తలు నెల్లూరు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 28, 2023, 3:53 PM IST
Somireddy Complaint to Police on CS, DGP about Illegal Mining : నెల్లూరు జిల్లాలో కేజీఎఫ్ సినిమాను మించి అక్రమ మైనింగ్ జరుగుతున్నా అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, డీఎమ్జీ, కలెెక్టర్, ఎస్సీలపై నెల్లూరు రూరల్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. జిల్లాలో అక్రమ మైనింగ్ యథేచ్చగా సాగుతున్నా కలెెక్టర్, పోలీసులు పట్టించుకోవటం లేదని సోమిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. భారీ పేలుడు పదార్థాలతో తెల్లరాయిని కొల్లగొడుతున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా అక్రమ మైనింగ్ తరలించే వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.
Polices Careless Attitude in Illegal Mining : జిల్లాలోని పొదలకూరు మండలం వరదపురం గ్రామంలో సుమారు డెబ్భై ఎకరాల్లో అక్రమ మైనింగ్ జరుగుతుందని సాక్ష్యాధారాలతో రాష్ట్ర, జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని సోమిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ మైనింగ్‌లో భాగంగా పేలుడు పదార్థాలను ఉపయోగిస్తున్నారని, ఏదైనా అనుకొని సంఘటన జరిగితే భారీగా నష్టం వాటిల్లుతుందని వ్యాఖ్యానించారు. అక్రమ మైనింగ్‌ను ఆపాలని, పాత వారికే అనుమతులు ఇవ్వాలని హైకోర్టు ఇచ్చిన ఆర్డర్‌ను జిల్లా అధికారులు బేఖాతరు చేశారని ఉద్ఘాటించారు.