software engineer: కర్నూలులో యువకుల హల్చల్.. సాప్ట్వేర్ ఇంజనీర్‌పై దాడి - cctv records Attacks by youth gangs
🎬 Watch Now: Feature Video
కర్నూలు నగరంలో గుర్తు తెలియని యువకులు ముఠా దాడులకు పాల్పడుతూ హల్చల్ చేస్తున్నారు. శనివారం సాయంత్రం కర్నూలు పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలాజీ విల్లాస్‌కు చెందిన జగదీశ్వర్ రెడ్డి అనే ఓ సాప్ట్వేర్ ఇంజనీర్‌పై దౌర్జన్యానికి తెగబడి దాడి చేశారు. అడ్డొచ్చిన వారిని సైతం యువకులు చితకబాదారు. గ్యాస్ సిలిండర్‌తో జగదీశ్వర్ రెడ్డిని కొట్టబోయారు. చుట్టుపక్కల ఉన్నవారు అదుపు చేయడంతో జగదీశ్వర్ రెడ్డి ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ యువకులు బి. తాండ్రపాడు గ్రామానికి చెందిన నాగరాజు అనే వ్యక్తిపై దాడికి పాల్పడడంతో పాటు జీ. పుల్లారెడ్డి పాలిటెక్నిక్ కళాశాల వాచ్‌మెన్‌తో పాటుగా మరికొంతమంది విద్యార్థులపై సైతం దాడి చేశారు. దాడిలో గాయాల పాలైన జగదీశ్వర్ రెడ్డి, నాగరాజు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై బాధితులు తాలూకా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దాడి చేసిన యువకులను పోలీసులు త్వరగా అదుపులోకి తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. దాడికి పాల్పడిన దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదు అయ్యాయి.