వంజంగి కొండలపై శ్వేతవర్ణ సోయగాలు - తిలకించేందుకు తరలివస్తున్న పర్యటకులు - Alluri tourist attractions
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 5, 2023, 11:19 AM IST
Snowfall at Vanjangi Hills in Paderu : అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో ప్రముఖ పర్యాటక కేంద్రం వంజంగి (Tourist Center Vanjangi).. పర్యటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. వంజంగి కొండలు ఆదివారం పర్యటకులతో కిటకిటలాడాయి. వంజంగి కొండలపై శ్వేతవర్ణ సోయగాలు ప్రకృతి ప్రియులను ఇట్టే ఆకట్టుకుంటున్నాయి.
Beauty of Vanjangi Hills in Alluri District : మంచు సోయగం పాలసముద్రాన్ని కల్పిస్తూ పర్యటకులను ఆకట్టుకుంది. చూపరులను మరో ప్రపంచంలోకి తీసుకెళతాయి అనడంతో అతిశయోక్తి లేదు. ప్రకృతి ప్రేమికులకు (Nature Lovers) ఆహ్లాదాన్ని పంచుతూ ఆరోగ్యాన్ని అందిస్తోంది. ప్రకృతి రమణీయ దృశ్యాలకు వంజంగి కొండలు కేరాఫ్ అడ్రస్‌గా నిలవడమే కాకుండా.. అక్కడ ఉన్న సహజసిద్ధమైన అందాలు ప్రకృతి ప్రేమికులను స్వర్గంలో తెలిపోయోలా చేస్తున్నాయి. రాత్రివేళలో చంద్రుడి వెన్నెల కాంతి, తెల్లవారుజామున సూర్యోదయం.. ఈ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని తిలకించేందుకు పర్యటకులు భారీ స్థాయిలో తరలి వస్తున్నారు. పర్యటకులు పెరగడంతో కొండ ఘాట్ రోడ్డు వాహనాలతో కిక్కిరిసింది. సుదూర ప్రాంతాల నుంచి పర్యటకులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.
Snowfall at Vanjangi Attracting Visitors with Beautiful Nature : ఘాట్ రోడ్లో ప్రయాణిస్తూ.. ప్రకృతి ఇచ్చే స్వచ్చమైన గాలిని ఆస్వాదిస్తూ అలా కొద్ది సేపు ఆ కొండల్లో ప్రకృతి ప్రేమికులు సేద తీరుతూ గాలిలో తెలుతున్నారు. అటు వైపుగా వెళ్లినవారు తమ సెల్ ఫోన్లో ప్రకృతి అందాలను బంధించకుండా ఉండలేక పోతున్నారు.