తెల్లవారుతోందంటే చాలు! - వాహనాలు, పంట పొలాలపై తీవ్ర ప్రభావంతో సర్వత్రా ఆందోళన - పొగమంచుతో వాహనదారులు ఇబ్బందులు

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 26, 2023, 1:17 PM IST

Snow Covered Roads in Anantapur District : అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో మంగళవారం తెల్లవారుజామున దట్టమైన పొగమంచు కమ్ముకుంది. తీవ్రమైన పొగ మంచుతో వాహనదారులు, రైతులు ఇబ్బంది పడ్డారు. తెల్లవారుజాము నుంచి ఉదయం 8 గంటల వరకు అనంతపురం నుంచి కర్ణాటకలోని పావగడ, బళ్ళారి వైపు వెళ్లే రహదారిలో పొగ మంచు అలుముకుంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎక్కడ ఏం ప్రమాదం జరుగుతుందో అని ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని వాహనాలను నడిపారు.

Crop Fields Damaged by Fog : అనంతపురం జిల్లాలో ఉష్ణోగ్రతలు క్షీణించడం వల్ల చలి తీవ్రత పెరిగింది. దీంతో ప్రజలు, వాహనదారులు రోడ్డుపై ప్రయాణించడానికి అంత ఆసక్తిని కనపరచలేదు. ఆర్టీసీ బస్సులు ఆలస్యంగా రాకపోకలు సాగించాయి. పొగమంచు కారణంగా వాహనదారులు, ప్రజలు ఒకవైపు బాధపడుతుంటే, మరోవైపు పండించిన పంట తెగుళ్లు బారిన పడుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వాతావరణంతో పండించిన పంట దెబ్బ తింటుందని రైతులు వాపోతున్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.