School Sweepers Relay Hunger Strike ఐదు నెలలుగా జీతాలు లేక అవస్థలు పడుతున్న పాఠశాల స్వీపర్ల.. రిలే నిరాహార దీక్షలకు మద్దతుగా సీఐటీయూ

🎬 Watch Now: Feature Video

thumbnail

School Sweepers Relay Hunger Strike : ఏలూరు నగరపాలక సంస్థ పరిధిలో పని చేస్తున్న పాఠశాల స్వీపర్లకు అయిదు నెలలుగా వేతనాలు చెల్లించలేదని, బకాయిల వెంటనే చెల్లించాలని స్వీపర్లు డిమాండ్ చేశారు. సీఐటీయూ ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం ముందు స్వీపర్లు రిలే నిరాహార దీక్ష చేపట్టారు.

గత 5 మాసాలుగా తమకు జీతాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, ఇచ్చే అరకొరా జీతం కూడా సక్రమంగా రాక కుటుంబ ఆర్థిక వ్యవస్థ చిన్నా భిన్నంగా తయారు అయ్యిందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో మున్సిపాలిటీలో పని చేస్తున్న తమని విద్యాశాఖ పరిధిలో కలపారని, తమకు జీతాలు చెల్లించే విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇచ్చే 4000 రూపాయలు వెంటనే జమ చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు. 

సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు బి సోమయ్య మాట్లాడుతూ స్కూల్ స్వీపర్లు ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు రోజుకు 10 గంటల పాటు పని చేసినా వారికి ఇవ్వాల్సిన జీతాలు సకాలంలో చెల్లించకుండా, పస్తులతో మాడుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కూల్ స్వీపర్ల పట్ల ప్రభుత్వం, అధికారులు నిర్లక్ష్య వైఖరి విడనాడి తక్షణమే వారి వేతనాలు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.