SC ST Employees JAC Agitation in Vijayawada on Reservations: సమస్యలు పరిష్కరించకుంటే.. సీఎం క్యాంప్ ఆఫీసు ముట్టడిస్తాం: ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల జేఏసీ - Against Middle Level Officers Committee
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 30, 2023, 5:12 PM IST
AP SC ST Employees JAC Agitation in Vijayawada on Reservations In Promotions: రాష్ట్రంలో అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం కాకుండా.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగాన్ని వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తోందని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల జేఏసీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు ప్రమోషన్లలో కల్పించే రిజర్వేషన్‌ను తొలగించాలని చూస్తోందని మండిపడ్డారు. అందుకోసమే మిడిల్ లెవెల్ ఆఫీసర్స్ కమిటీని నియమించిందని.. ఎస్సీ ఎస్టీ ఎంప్లాయిస్ టీచర్స్ గెజిటెడ్ ఆఫీసర్స్ జేఏసీ నాయకులు ఆరోపించారు. ఆ కమిటీ ఇచ్చిన నివేదికను ప్రభుత్వం ఆమోదించడాన్ని వ్యతిరేకిస్తూ.. ఇరు సంఘాల నేతలు విజయవాడ ధర్నా చౌక్‌లో ఆందోళనకు దిగారు.
ప్రభుత్వం తక్షణమే చర్చలకు చర్యలు తీసుకుని.. తమ డిమాండ్లను పరిష్కరించాలన్నారు. కానీసీక్వెన్షియల్ సీనియారిటీని అమలు చేయాలని.. మిడిల్ లెవెల్ ఆఫీసర్స్ కమిటీ ఇచ్చిన నివేదికను రద్దు చేయాలని కోరారు. ఆర్అండ్బీ శాఖలో ఎంపవర్డ్ కమిటీ నివేదికను అమలు చేయాలన్నారు. నీటి పారుదల శాఖలో సీనియర్లకు ఎఫ్ఏసీ లేదా ఇంచార్జీలుగా అవకాశం ఇవ్వాలని కోరారు. తమ సమస్యలను పరిష్కరించకుంటే.. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించటానికి సైతం వెనకాడేది లేదని తెల్చి చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి చర్చలు జరపాలని హెచ్చరించారు.