సత్తెనపల్లికి అంబటి వద్దు - అధిష్ఠానాన్ని కలిసే యోచనలో ద్వితీయశ్రేణి నేతలు - అంబటి రాంబాబు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 15, 2024, 10:23 PM IST
Sattenapalle YSRCP Leaders Fires On Ambati Rambabu: మంత్రి అంబటి రాంబాబుకు సొంతపార్టీలోనే నిరసన సెగ తగిలింది. రానున్న ఎన్నికల్లో సత్తెనపల్లి వైఎస్సార్సీపీ టికెట్ అంబటికి ఇవ్వొద్దంటూ ద్వితీయ శ్రేణి నేతలు అధిష్ఠానాన్ని కోరారు. రాజుపాలెం మండలం కోటనెమలిపురిలో సమావేశమైన నాలుగు మండలాలకు చెందిన నేతలు, మంత్రి అంబటికి వ్యతిరేకంగా తీర్మానం చేశారు. సత్తెనపల్లిలో స్థానిక నేతలకు మాత్రమే టిక్కెట్టు ఇవ్వాలని వారు కోరారు. త్వరలోనే తాడేపల్లి వెళ్లి పార్టీ పెద్దలను కలవనున్నట్లు చెప్పారు.
తాను పార్టీకి విదేయుడినని చెప్పుకునే మంత్రి అంబటి రాంబాబు, స్వంత పార్టీ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నాడని వైఎస్సార్సీపీ నేతలు ఆరోపించారు. అంబటి తీరుపై సత్తెనపల్లి నియోజకవర్గంలో అన్ని సామాజిక వర్గాలు వ్యతిరేకంగా ఉన్నాయన్నారు. అంబటికి కాకుండా సత్తెనపల్లిలో ఎవ్వరికి టికెట్ ఇచ్చినా కష్టపడి గెలిపిస్తామని వెల్లడించారు. రేపల్లెలో ఓడిపోయిన రాంబాబును తీసుకువచ్చి సత్తెనపల్లిలో పోటీ చేయించారని, అక్కడి ప్రజలు అంబటి రాంబాబు తీరును గురించి చెప్పినా, తాము గెలిపించుకున్నామని తెలిపారు. గెలిచిన తరువాత కార్యకర్తలను గౌరవించడం లేదని, ఆయన తీరుపై కార్యకర్తలు వ్యతిరేకంగా ఉన్నారని తెలిపారు. అంబటికి గెలుస్తాడా లేదా అన్న అంశంపై సీఎం జగన్ సర్వే చేయాలని వైఎస్సార్సీపీ నేతలు సూచించారు.