Sardar Vallabhbhai Patel Birth Anniversary : అనంతపురంలో జాతీయ సమైక్యతా దినోత్సవం.. 2కే రన్ ప్రారంభించిన ఎస్పీ అన్బురాజన్ - 2కే రన్ ప్రారంభించిన ఎస్పీ అన్బురాజన్

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 31, 2023, 1:49 PM IST

Sardar Vallabhbhai Patel Birth Anniversary in Anantapuram : మాజీ ఉప ప్రధాని, ఉక్కు మనిషి సర్ధార్ వల్లభాయ్ పటేల్ స్ఫూర్తితోనే రక్షణ బలగాలు దేశ అంతర్గత భద్రతను కాపాడుతున్నాయని అనంతపురం జిల్లా ఎస్పీ అన్బురాజన్ అన్నారు. సర్ధార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని అనంతపురం జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణలో జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని (National Unity Day 2023) నిర్వహించారు. ముందుగా సర్ధార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి ఆయన పూల మాల వేసి నివాళులు అర్పించారు. బెలూన్లు, తెల్ల పావురాలను ఎగురవేశారు. 

SP Anburajan Celebrate National Unity Day 2023 : అనంతరం దేశ సమైక్యత, సమగ్రతలకు అంకితభావంతో పాటు పడదామని సిబ్బందిచే అన్బురాజన్ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం 2కే రన్ (Police 2K Run) ప్రారంభించారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ భారత దేశ ఉక్కు మనిషిగా పేరొందిన సర్ధార్ వల్లభాయ్ పటేల్ స్వాతంత్య్ర సమరయోధుడిగా అనేక సేవలు అందించాడని గుర్తు చేశారు. స్వాతంత్య్ర అంనంతరం 543 రాజరిక సంస్థానాలను విలీనం చేయడానికి గట్టి కృషి చేశారన్నారు. అన్ని కలిసి వచ్చినప్ఫటికీ మూడు సంస్థానాలు ముందుకు రాలేదన్నారు. హైదరాబాద్, జొనాఘడ్, జమ్ము కాశ్మీర్ సంస్థానాలను అతి తక్కువ కాలంలో పోలీసు, మిలిటరీ బలగాల ద్వారా విలీనం చేసిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. మహాత్ముల ఆశయాల వల్ల నేడు మనం కన్యాకుమారి టు కాశ్మీర్ వరకు స్వేచ్ఛగా, ఐక్యంగా జీవిస్తున్నామన్నారు. త్యాగధనులను స్ఫూర్తిగా చేసుకుని విధులు నిర్వహిద్దామన్నారు. జాతీయోద్యమానికి ఆకర్షితుడైన ఆయన మహాత్మా గాంధీజీ నాయకత్వంలో కొనసాగిన ఉద్యమాల్లో పాలు పంచుకున్నాడన్నారు. 

బ్రిటీష్ ప్రభుత్వం విధించిన పన్నులకు వ్యతిరేకంగా జరిపిన కిసాన్ ఉద్యమం, సహాయ నిరాకరణ, క్విట్ ఇండియా ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించాడన్నారు. దేశ ప్రజల సంక్షేమం కోసం చాలా సాంఘిక ఉద్యమాలు నిర్వహించాడన్నారు. గుజరాత్ రాష్ట్రంలో మద్యపానం, అస్పృస్యత, కుల వివక్షలకు వ్యతిరేకంగా పని చేశారన్నారు. రాజ్యాంగ సభ్యుడిగా, మంచి నాయకుడిగా భారత ప్రజలకు ఎనలేని సేవలందించి చరిత్ర పుటల్లో అగ్రస్థానంలో నిలవడం ముదావహమన్నారు. సర్ధార్ వల్లభాయ్ పటేల్ చేసిన సేవలకు ప్రభుత్వం గుర్తించి 1991 సంవత్సరంలో భారతరత్న అవార్డును ప్రదానం చేయడం అభినందనీయమని ఎస్పీ అన్బురాజన్ అన్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.