Para Badminton Player Rupa Devi: పారా బ్యాడ్మింటన్​లో రూపాదేవి సత్తా.. అంతర్జాతీయ టోర్నమెంట్​లో పతకాలు - Rupa Devi from Srikakulam district

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 10, 2023, 3:38 PM IST

Para Badminton Player Rupa Devi Won Three Silver Medals: శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలం సంతవురిటి గ్రామానికి చెందిన రూపాదేవి పారా బ్యాడ్మింటన్ టోర్నమెంట్​లో మూడు సిల్వర్ మెడల్స్ సాధించింది. ఈ నెల 9వ తేదీన ఉగాండాలో జరిగిన అంతర్జాతీయ సింగిల్స్, డబుల్స్, మిక్స్​డ్​ డబుల్ విభాగాల్లో ఈమె పాల్గొని మూడు సిల్వర్ మెడల్స్ కైవసం చేసుకుంది. రూపాదేవి అంతర్జాతీయ స్థాయిలో మెడల్స్ సాధించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

పడాల రూపాదేవికి అనుకోని ప్రమాదంలో.. తన రెండు కాళ్లలో కదలిక కోల్పోయింది. తన జీవితం అంతే అని నిరాశపడకుండా.. తలరాతకు తలొంచకుండా తట్టుకుని నిలబడింది. చిన్న పల్లెటూరు నుంచి క్రమంగా ఎదుగుతూ.. పారా బ‌్యాడ్మింటన్‌లో అంతర్జాతీయ స్థాయికి చేరింది. ఇప్పటికే జాతీయ స్థాయిలో బంగారు, వెండి పతకాలు గెలిచిన రూపా దేవి.. తాజాగా మరో మూడు సిల్వర్ మెడల్స్​ను కైవసం చేసుకుంది.   

అనుకోని ప్రమాదంలో కాళ్ల కదలిక కోల్పోయినా.. పట్టుదలతో జాతీయ స్థాయిలో పతకాలు సాధిస్తున్న రూపాదేవికి ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు కొద్ది నెలల క్రితం.. 3 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించారు. పారా బ్యాడ్మింటన్‌ రంగంలో మరిన్ని పతకాలు సాధించాలని ఆశిస్తూ ఉత్తరం రాశారు.  

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.