thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 14, 2023, 7:16 PM IST

ETV Bharat / Videos

Rivers are Overflowing Due to Rains in Alluri District: అల్లూరి జిల్లాలో వర్షాలు.. సంగంవలసలో కొట్టుకుపోయిన కల్వర్టు

Rivers are Overflowing Due to Rains in Alluri Seethamaraju District: అల్లూరి సీతారామరాజు జిల్లాలో గత మూడు రోజులుగా ఆగకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, గెడ్డలు పొంగి.. పంట పొలాలు జలమయం అవుతున్నాయి. గెడ్డలు పొంగి వంతెనలు, కల్వర్టుల పైనుంచి నీరు ప్రవహిస్తున్నాయి. దీంతో స్థానికంగా రాకపోకలు స్తంభించాయి. ముంచంగిపుట్టు మండలంలో వర్షానికి లక్ష్మీపురం ప్రాంతంలో కర్లాపొదోర్‌, అదే గ్రామ సమీపంలోని గెడ్డలు పొంగి వంతెనపై నుంచి ప్రవహిస్తున్నాయి.  లక్ష్మీపురం పంచాయతీ సంగంవలసలో కల్వర్టు కొట్టుకుపోయింది. ముంతగుమ్మి, తుమిడిపుట్టు, బిరిగుడ గెడ్డల ఉద్ధృతితో బుంగాపుట్టు, లక్ష్మీపురం పంచాయతీలకు చెందిన 18 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గుమ్మశిరగంపుట్టు, కరిముఖిపుట్టు, కుమడ ప్రాంతాల్లో వరి, రాగి, సామ పంటలు జలమయం అయ్యాయి. అధిక వర్షంతో తీరని నష్టం వాటిల్లిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షానికి శిరగంపుట్టు నుంచి బరడ వరకు రహదారి పూర్తిగా పాడైపోయింది. కరిముఖిపుట్టు వద్ద కల్వర్టు పైనుంచి నీరు ప్రవహించడంతో కుమడ, బూసీపుట్టు, కొరవంగి, బాబుసాల ప్రాంతాలకు రాకపోకలు ఆగిపోయాయి. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.