ఏపీలో ఎంపీ, ఎమ్మెల్యేలపై 78 కేసులు: విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టు - ఏపీ పెండింగ్ కేసులు

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 27, 2023, 5:35 PM IST

Representatives Court Vijayawada: ఏపీలో ఎంపీలు, ఎమ్మెల్యేలపై 78 కేసులు పెండింగ్​లో ఉన్నాయని విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టు హైకోర్టుకు తెలిపింది. ప్రజాప్రతినిధులపై కేసుల విచారణలో వేగం పెంచాలన్న సుప్రీం కోర్టు ఆదేశాల నేపథ్యంలో, ఏపీ హైకోర్టు సుమోటోగా విచారణను చేపట్టింది. ఈ కేసులపై ట్రయల్ త్వరగా పూర్తి చేయటానికి అవసరమైన చర్యలను చేపట్టింది. అదనపు వివరాలు ఉంటే తెలపాలని అడ్వకేట్ జనరల్​కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను న్యాయస్థానం రేపటికి వాయిదా వేసింది. ప్రజాప్రతినిధులపై ఎన్ని కేసులు పెండింగ్​లో ఉన్నాయో వివరాలు గత విచారణలో హైకోర్టు విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టును ఆదేశించింది.

చట్టసభల సభ్యులపై నమోదైన కేసులు ప్రజాస్వామ్యంపై పత్యక్షంగా ప్రభావం చూపుతున్నాయని దేశోన్నత న్యాయస్థానం గతంలో వివరించిన విషయం తెలిసిందే. ప్రభావం చూపుతున్నాయని, ఈ కేసులను ప్రాధాన్య క్రమంలో తప్పనిసరిగా విచారించాలని తెలిపింది. విచారణలో వేగంగా తీర్పు వెలువరించడానికి సాధ్యమైన అన్ని ప్రయత్నాలు చేయాలని ఆదేశించింది. ప్రజాస్వామ్యం సమర్థంగా, ప్రభావశీలంగా పనిచేయడానికి ప్రజాప్రతినిధులపై విశ్వాసం ముఖ్యమని ఈ సందర్భంగా స్పష్టం చేసింది. కానీ, న్యాయస్థానాల్లో ప్రజాప్రతినిధులపై పెండింగ్‌లో ఉన్న కేసులను పరిశీలిస్తే అలాంటి నమ్మకం కలగడం కష్టమని వ్యాఖ్యానించింది. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.