Raghurama on Viveka case: వివేకా హత్య కేసు.. త్వరలోనే బయటపడనున్న పెద్దల పేర్లు: రఘురామ - Viveka murder case news
🎬 Watch Now: Feature Video

Raghuramakrishna Raju comments on Viveka murder case: వివేకా హత్య కేసులో ఇంకా కొంత మంది పెద్దల పేర్లను సీబీఐ త్వరలోనే బయటపెడుతుందని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. వివేకా హత్య కేసులో జరుగుతున్న విషయాలపై పలు వ్యాఖ్యలు చేశారు. ఆ రోజు గంగిరెడ్డి, అవినాష్‌రెడ్డి మధ్య ఏం జరిగింది అనే విషయంపై పలు రకాల వ్యాఖ్యలు చేశారు. వివేకా హత్య జరిగిన రోజు రాత్రి ఒంటి గంట 37 నిమిషాల నుంచి ఉదయం 5 గంటల 18 నిమిషాల వరకు గంగిరెడ్డి, అవినాష్‌రెడ్డి మాట్లాడుకున్నారు. ఇలా ఆ రోజు రాత్రి అనేక కాల్స్ వెళ్లాయని ఆరోపించారు. ఇంతే కాకుండా వెరే నంబర్లకు కూడా ఫోన్లు వెళ్లాయని అన్నారు. హత్య జరిగిన సమయంలో ఎందుకని అన్ని సార్లు ఫోన్లు వచ్చాయని అన్నారు. సీబీఐ చార్జ్‌షీట్‌లో ఇంకా కొన్ని పేర్లు పెట్టలేదు.. కొన్ని రోజులు ఆగితే అన్ని పేర్లు బయటకు వస్తాయని అన్నారు. అంతే కాకుండా గంగిరెడ్డి, అవినాష్‌రెడ్డి మధ్య.. వాట్సప్ కాల్స్ చిట్టా సీబీఐ అదనపు ఛార్జ్‌షీట్‌లో బయటపడిందని రఘురామ వెల్లడించారు.