ధర్మవరంలో ఉద్రిక్తత - నోటీసులు లేకుండా ఇళ్లు కూల్చేందుకు సిద్దమైన అధికారులు, అడ్డుకున్న పరిటాల శ్రీరామ్ - ఏపీ వార్తలు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 8, 2023, 12:58 PM IST
R and B Officials Try to Demolish Houses in Dharmavaram : శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో రాత్రి ఆర్ అండ్ బీ అధికారులు రెచ్చిపోయారు. రైల్వే వంతెన నిర్మాణం కోసం ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా సంజయ్ నగర్‌లో ఇళ్లను కూల్చేందుకు గురువారం మధ్యాహ్నం పోలీసు బందోబస్తుతో చేరుకున్నారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా కూల్చివేస్తే ఇప్పటికిప్పుడు ఎక్కడికెళ్లలంటూ బాధితులు అధికారుల్ని నిలదీశారు. సమాచారం అందుకుని ధర్మవరం తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జ్ పరిటాల శ్రీరామ్ (Paritala Sriram) సంఘటన స్థలానికి చేరుకున్నారు. కోర్టు స్టే ఉన్నా ఎలా కూలుస్తారంటూ అధికారుల్ని నిలదీయడంతో వారు అక్కడి నుంచి వెనుతిరిగారు.
TDP Incharge Paritala Sriram Stop Demolish Houses in Sri sathya Sai District : ప్రజాప్రతినిధి ఒత్తిడితో మరోసారి రాత్రి 7 గంటలకు మళ్లీ పొక్లెయిన్లతో వచ్చి నిర్మాణాల కూల్చివేత ప్రారంభించారు. బాధితుల నుంచి సమాచారం అందుకున్న టీడీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో చేరుకుని అడ్డుకోవడంతో కొద్ది సేపు అధికారులకు పార్టీ నేతలకు మధ్య తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకొంది. బాధితులకు న్యాయం జరిగే వరకు ఇళ్ల తొలగింపు చేపట్టవద్దని వారు తెలపటంతో ఆర్ అండ్ బీ అధికారులు, పోలీసులు వెనుదిరిగారు.
రైల్వే ట్రాక్ సమీపంలో ఇళ్లు నిర్మించుకుని నలభై సంవత్సరాలుగా నివాసం ఉంటున్నామని బాధితులు చెబుతున్నారు. అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని, తగిన పరిహారం ఇచ్చి వేరే ప్రాంతానికి తరలించాలని డిమాండ్ వారు చేస్తున్నారు.