Protest to CM Jagan From Amaravati Farmers in Mandadam: సీఎం జగన్‌కు రాజధాని రైతుల నుంచి నిరసన సెగ.. "మీకు అప్పు పుట్టినట్లు.. మాకు అప్పు పుట్టడం లేదు సార్" - capital Farmers news
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 20, 2023, 2:10 PM IST
Protest to CM Jagan From Amaravati Farmers in Mandadam : మంత్రివర్గ సమావేశానికి వెళ్తున్న ముఖ్యమంత్రి మోహన్ జగన్ రెడ్డికి రాజధాని రైతుల నుంచి నిరసన సెగ తగిలింది. ఈ ఘటన గుంటూరు జిల్లా మందడంలో చోటు చేసుకుంది కౌలు డబ్బులు ఇవ్వాలంటూ రైతులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వీరిని అడ్డుకునేందుకు భారీగా పోలీసులను మోహరించారు. మే నెలలో రావాల్సిన చెక్కులు ఇంత వరకు రాకపోతే ఎలా బతకాలని రైతులు సీఎంని ప్రశ్నించారు. "మీకు అప్పు పుట్టినట్లు మాకు అప్పు పుట్టడం లేదు" అని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌలు డబ్బులు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెలాఖరు లోపు కౌలు డబ్బులు ఇవ్వకపోతే ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని సీఆర్డీఏ కార్యాలయాన్ని ముట్టడిస్తామని అమరావతి రైతులు హెచ్చరించారు.
"ఈ సంవత్సరం అమరావతి రైతులకు ఇవ్వాల్సిన కౌలు డబ్బులు ఇంత వరకు ఇవ్వలేదు. జగన్‌కు లక్షల కోట్లు అప్పులు వస్తున్నాయి. మాకు ఎవ్వరు ఇస్తారు అప్పు. మేము ఆత్మహత్యలు చేసుకోవాలి.. లేకపోతే తిండి తినకుండా పస్తులుండాలి. మమ్మల్ని పట్టించుకోని ముఖ్యమంత్రి మాకు అవసరం లేదు."- అమరావతి రైతులు