PRATHIDWANI: ప్రాణం తీసిన పిచ్చి, తలతిక్క నిబంధనలు
🎬 Watch Now: Feature Video
PRATHIDWANI: పింఛను పోయింది.. ఆకలి చంపేసింది. శ్రీకాకుళం జిల్లా మెళియపుట్టిలో చోటుచేసుకున్న హృదయవిదారకమైన సంఘటన ఇది. వందలు.., వేల కోట్ల రూపాయల పథకాలతో గిరిజనాన్ని ఉద్ధరిస్తున్నామని చెప్పుకునే పాలకపెద్దల ప్రకటనల్లో డొల్లతనం... అధికారుల నిర్లక్ష్యాన్ని అందరి కళ్లకు కట్టిన ఆకలిచావు కేక ఇది. ఏడాదిన్నరగా ఒక్కరంటే ఒక్కరు ఆ అభాగ్యుడి కన్నీటి గోడు పట్టించుకోలేదు. ఆసరాగా ఉన్న ఆ కాస్తంత పింఛను కూడా.. పిచ్చి, తలతిక్క నిబంధనల పేరుతో ఆపేస్తే.. 15నెలలు అయ్యా.. బాబూ.. అని మొత్తుకున్నా కరకుగుండెలు కాస్తైనా కనికరం చూపలేక పోయాయి. చివరకు ఆ ఆకలిమంటలతోనే అలమటించి గురువారం తెల్లవారు జామున కన్ను మూశాడు ఆ వృద్ధుడు. ఎవరిదీ పాపం? అసలు ఎక్కడున్నాం మనం...? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని