PRATHIDWANI పాఠశాల విద్యావ్యవస్థ ఎదుర్కొంటున్న ఇబ్బందులేంటి - ప్రతిధ్వని
🎬 Watch Now: Feature Video
రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో సంస్కరణల ప్రక్రియ విద్యావ్యవస్థ పాలిట గుదిబండగా మారింది. ఉపాధ్యాయుల నియామకాలు, బదిలీలు, హేతుబద్ధీకరణలో కొనసాగుతున్న ఆలస్యంతో పాఠ్యప్రణాళికలు అదుపు తప్పుతున్నాయి. పాఠశాలల వారీగా సీబీఎస్‌ఈ, రాష్ట్ర బోర్డుల సిలబస్‌ల్లో ఏది ఎంచుకోవాలనే విషయంలోనూ విద్యార్థుల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు అరకొరగా జరిగిన పుస్తకాల పంపిణీ, బైజూజ్ పాఠ్య ప్రణాళిక ఆన్‌లైన్ ఛార్జీల భారం తల్లిదండ్రులకు అదనపు భారంగా మారాయి. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో పాఠశాల విద్యావ్యవస్థ ఎదుర్కొంటున్న ఇబ్బందులు, పరిష్కారాలపై ఈరోజు ప్రతిధ్వని.
Last Updated : Feb 3, 2023, 8:30 PM IST