ప్రేమ వివాహం పేరుతో బాల్య వివాహం
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 5, 2024, 5:38 PM IST
Police Stopped Child Marriage: బాల్య వివాహాలు చేయటం, ప్రోత్సహించటం చట్టరిత్యా నేరం. ఒకవేళ నేరం రుజువైతే రెండేళ్ల జైలు శిక్ష, 2 లక్షలు రూపాయల జరిమానా ఉంటుందని, బాలికలకు విద్య అందించి ఉన్నత శిఖరాలు అధిరోహించేలా చేయాలని ఎన్ని అవగాహన కార్యక్రమాలు కల్పిస్తున్నా బాల్య వివాహాలకు అడ్డుకట్ట పడటం లేదు. తాజాగా తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం కోరుమామిడిలో మైనర్ వివాహం చేయటానికి ప్రయత్నించారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి వెళ్లి వివాహాన్ని అడ్డుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం జిల్లాలో అమ్మేపల్లి ఆంజనేయ రాజరాజేశ్వరి ఆలయంలో బాల్య వివాహం చేయబోతున్నారని పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని వివాహాన్ని ఆపేశారు. బాలిక తల్లిదండ్రులు లేకుండానే పెళ్లి జరుగుతుందని తెలిసి పోలీసులు అవాక్కయ్యారు. మైనర్ వివాహం చేస్తే శిక్ష తప్పదని హెచ్చరించారు. ప్రేమ పెళ్లి అని బాలిక తరపు వారు చెప్పటంతో, మైనారిటీ తీరిన తరువాతే వివాహం చేయాలని కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేశారు. మళ్లీ ఎక్కడైనా వివాహం చేయడానికి ప్రయత్నిస్తే చట్ట ప్రకారం నేరస్థులు అవుతారని ఇరు వర్గాల వారిని హెచ్చరించారు.