రౌడీ షీటర్లపై పోలీసుల ఉదాసీనత - నామమాత్ర కేసులు తప్ప చర్యలేవీ : సీపీఎం - రూరల్ పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి సీపీఎం
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/01-12-2023/640-480-20157268-thumbnail-16x9-police-neglect-to-arrest-rowdy-sheeters.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 1, 2023, 1:05 PM IST
Police Neglected to Arrest Rowdy Sheeters : రౌడీ షీటర్లను అరెస్ట్ చేయడంలో పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ సీపీఎం నాయకులు ఆందోళన చేపట్టారు. అనంతపురంలోని రూరల్ పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. స్థానిక రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో.. రాజు అనే రౌడీ షీటర్ పేదలను నిత్యం వేధిస్తూ.. వారిపై దాడులకు పాల్పడుతున్నాడని సీపీఎం నాయకుడు నాగేంద్ర ఆరోపించారు. అతడిపై ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా.. పోలీసులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గత వారం రౌడీ షీటర్ రాజు.. పాండు అనే వ్యక్తిపై దాడి చేయగా.. ప్రాణాప్రాయ స్థితిలో ఉన్నారని వాపోయారు. ఈ విషయాన్ని సంబంధిత అధికారులు, పోలీసులకు విజ్ఞప్తి చేసినా.. ఎలాంటి ప్రయోజనం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రౌడీ షీటర్లపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా.. కేసు నమోదు చేస్తారే కానీ వారిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. పోలీసులు రాజును వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.