Police Arrested Ex Rowdy Sheeter in Mangalagiri: పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన మాజీ రౌడీ షీటర్.. నాటకీయపరిణామాల మధ్య అరెస్ట్ - Former rowdy sheeter arrested by police

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 10, 2023, 2:13 PM IST

Police Arrested Ex Rowdy Sheeter in Mangalagiri: గుంటూరు జిల్లాలో మాజీ రౌడీ షీటర్ బుల్లా ఏసుబాబుని పోలీసులు నాటకీయ పరిణామాల మధ్య అరెస్టు చేశారు. ఒకనొక సమయంలో పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు నిందితుడు నానా తంటాలు పడ్డాడు. దీంతో అతనిని అదుపులోకి తీసుకునేందుకు తీవ్రంగా కష్టపడాల్సి వచ్చింది. ఇద్దరిపై దాడి చేసిన మాజీ రౌడీ షీటర్ బుల్లా ఏసుబాబుని పోలీసులు అదుపులోకి తీసుకొనేందుకు వెళ్లగా స్థానికులు అడ్డగించారు. తనను అరెస్టు చేస్తే ఉరి వేసుకుంటానని నిందితుడు నాటకం ఆడగా ఎట్టకేలకు పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్​కు తరలించారు. ఈ ఘటన గుంటూరు జిల్లా మంగళగిరిలో సోమవారం చోటుచేసుకుంది. 

సీఐ మల్లికార్జునరావు తెలిపిన వివరాల ప్రకారం బాప్టిస్టు పేటకు చెందిన ఏసుబాబు, మరో ముగ్గురు కలిసి లక్ష్మీ నృసింహస్వామి కాలనీకి చెందిన నగేష్ అనే యువకుడిపై కర్రతో దాడి చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడు ఏసుబాబును అదుపులోకి తీసుకొనేందుకు బాప్టిస్టు పేటకు వెళ్లిన పోలీసులపై ఆయన కుటుంబసభ్యులు తీవ్రంగా ప్రతిఘటించారు. అదనపు సిబ్బందితో సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా నిందితుడు తన గదిలోకి వెళ్లి ఉరేసుకుంటానని బెదిరించాడు. అతన్ని స్టేషన్​కు తీసుకెళ్లే సమయంలో ఏసుబాబు అనుచరులు, కుటుంబసభ్యులు పోలీసులపై తిరగబడ్డారు. ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకోగా పోలీసులు వాటిని పగలగొట్టి ఏసుబాబును అదుపులోకి తీసుకున్నారు. దీంతో కాసేపు తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. ఏసుబాబు నేలపై పడి కదలకపోవడంతో వైద్యశాలకు తరలించగా వైద్యులు పరీక్షించి అతడికి ఏమీ కాలేదని చెప్పడంతో స్టేషన్కు తరలించామని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.