Pipe Line Leakage Sewage into Colonies : 'మేం మనుషులం కాదా.. మమ్మల్ని ఇలాగే వదిలేస్తారా..?' మూడ్రోజులుగా 'మురుగు'తున్న పేదలు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 31, 2023, 5:09 PM IST
Pipe Line Leakage Sewage into Colonies : గుంటూరులోని నెహ్రూ నగర్, చేనేత కాలనీ న్యూ గుంటూరు రైల్వే స్టేషన్ ప్రాంతాల్లోకి ముగురు నీరు చేరింది. రోడ్డు మీద వెళ్తుంటే మురుగు కాలువ వస్తేనే వాసన భరించలేక.. వెంటనే ముక్కు మూసుకుంటాం. అలాంటిది ఆ మురుగు నీరే ఇళ్లు, పరిసరాల్లోకి వస్తే..? ఆ దుర్వాసన భరించటం చాలా కష్టంగా ఉంటుంది. అలాంటి పరిస్థితిలో గత మూడు రోజులుగా గుంటూరు కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
సంజీవనగర్ రైల్వే గేటు వద్ద ఉన్న పైపు లైను మంగళవారం (ఆగస్టు 29) సాయంత్రం లీకైంది. తాగునీరు పైపు లీకైనప్పటికీ.. ఆ నీరంతా రహదారి వెంట ఉన్న మురుగు కాలువల్లో కలిసి కాలనీలోకి ప్రవహిస్తోంది. మురుగు కాలువలు సరిగ్గా లేకపోవడంతో.. అధిక మెుత్తంలో వస్తున్న నీరంతా రహదారులపైకి, లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వస్తోందని స్థానికులు వాపోతున్నారు. మూడు రోజులుగా నీటిలోనే ఉంటూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిల్వ ఉన్న మురుగు నీటి వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదముందని ఆందోళన చెందుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.