Protest: ఆందోళనకు దిగిన వైసీపీకు చెందిన వ్యాపారి.. అధికారుల తీరుపై ఆగ్రహం
🎬 Watch Now: Feature Video
Protested in Front of Authorities: అన్నమయ్య జిల్లా రాయచోటి మార్కెట్ యార్డులో వైసీపీకి చెందిన వ్యాపారి ఆందోళనకు దిగారు. 2022లో మార్కెటింగ్ శాఖ ద్వారా యార్డులో గోదాము లీజుకు తీసుకొని అందులో తన వ్యాపారానికి సంబంధించిన సామాగ్రిని ఉంచుకున్నానని తెలిపారు. మార్కెటింగ్ శాఖకు లీజు కూడా చెల్లించడం జరిగిందని అన్నారు. అయితే ఈవీఎంలను నిల్వ చేసేందుకు.. అధికారులు బలవంతంగా గోదామును ఖాళీ చేయిస్తున్నారని బాధితుడు ఆరోపిస్తున్నారు. గోదామును ఖాళీ చేయిచేందుకు వచ్చిన అధికారుల ఎదుట షరీఫ్ నిరసన తెలిపారు. ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా, కోర్టు పరిధిలో ఉన్న గోదామును.. అధికారులు బలవంతంగా ఖాళీ చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గోదాములో ఉన్న సామాగ్రిని బలవంతంగా బయట పెట్టించారని ఆరోపించారు. ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డికి ప్రధాన అనుచరుడైన షరీఫ్.. వైసీపీను నమ్ముకున్నందుకు తగిన శాస్తి జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. లీజు గడువు ముగిసిన తర్వాత గోదామును ఖాళీ చేయాలని సదరు వ్యాపారిని కోరినా అతను పట్టించుకోకపోవటంతో బలవంతంగా ఖాళీ చేయించాల్సి వస్తోందని అధికారులు తెలిపారు.