Pawan Fire on CM Jagan: సీఎం జగన్ పాలనలో చెట్లు సైతం విలపిస్తున్నాయి.. పవన్ ట్వీట్ - pawan kalyan twits
🎬 Watch Now: Feature Video
Pawan fire on Cm jagan about trees cuttings: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్.. సామాజిక మాధ్యమాల వేదికగా విరుచుకుపడ్డారు. ఈ వైఎస్సార్సీపీ పాలనలో వృక్షాలు సైతం విలపిస్తున్నాయంటూ విమర్శించారు. గతకొన్ని నెలలుగా ఏ ప్రాంతంలో సీఎం జగన్ పర్యటన ఉన్నా.. అక్కడ ఉన్న చెట్లను నరికివేసే ప్రక్రియ కొనసాగుతోందని ఆగ్రహిస్తూ.. అమలాపురంలో చెట్లను నరికి వేసిన ఫొటోలను, కోనసీమలో కొబ్బరి చెట్టును నరికివేసిన ఫొటోలను ట్విటర్‌లో ఆయన పోస్ట్ చేశారు. ఫొటోలతో పాటు జంధ్యాల పాపయ్యశాస్త్రిగారు రాసిన ‘పుష్ప విలాపం'లోని కొన్ని పద్యాలను పవన్ కల్యాణ్ ప్రస్తావించారు.
కొబ్బరి చెట్టును ఇంటికి పెద్ద కొడుకుగా భావిస్తారు.. రాష్ట్రంలో గతకొన్ని రోజులుగా సీఎం జగన్ మోహన్ రెడ్డి పర్యటన ఉందంటే చాలు.. అధికారులు అత్యుత్సాహం కనబరుస్తున్నారు. ఆ ప్రాంతంలో ఉన్న చెట్లను నరికివేయడం, ట్రాఫిక్ ఆంక్షలను విధించటంతో పాటు సీఎం సభ కోసం వందలాది ఆర్టీసీ బస్సులను కేటాయిస్తున్నారు. దీంతో ప్రజలు, ప్రయాణికులు, వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ఘటనలపై పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ..''కోనసీమలో కొబ్బరి చెట్టును ఇంటికి పెద్ద కొడుకుగా భావిస్తారు. అటువంటి కొబ్బరి చెట్లను సైతం నిలువునా నరికేశారు. తమిళనాడులో చెట్టును కుటుంబ సభ్యునిగా చూసుకుంటారు. ఈ రాష్ట్రంలో ఆస్తులు కూడబెట్టుకునే వాళ్లు ఈ విషయం కూడా తెలుసుకోవాలి'' అని హితవు పలికారు.
‘‘ఓయీ మానవుడా..
బుద్ధదేవుని భూమిలో పుట్టినావు
సహజమగు ప్రేమ నీలోన చచ్చెనేమి
అందమును హత్య చేసెడి హంతకుండా
మైలపడిపోయెనోయి నీ.. మనుజ జన్మ..
అని దూషించు పూలకన్నియల కోయలేక
వట్టిచేతులతో వచ్చిన నాయీ హృదయ కుసుమాంజలి గైకొని
నాపై నీ కరుణశ్రీరేఖలను ప్రసరింపుము ప్రభు'' అంటూ జంధ్యాల పాపయ్యశాస్త్రి ‘పుష్ప విలాపం’ పద్యాలను పవన్ ప్రస్తావించారు.